News September 24, 2024

నియోజకవర్గాల్లో ప్రతి నెలా జాబ్ మేళా: నారా లోకేశ్

image

AP: రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో యూనివర్సిటీలలో చదివే ప్రతి విద్యార్థికీ ఉద్యోగం రావాలన్నారు. దానికి అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పారు.

Similar News

News September 24, 2024

‘సత్యం సుందరం’ అరుదైన సినిమా: కార్తీ

image

అరవింద్ స్వామి, కార్తీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సత్యం సుందరం’ ఈ నెల 28న విడుదల కానుంది. ‘96’ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. తమ మూవీ చాలా అరుదైన స్టోరీతో వస్తోందని కార్తీ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నాకు కె. విశ్వనాథ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఇది సరిగ్గా ఆయన సినిమాల తరహాలోనే ఉంటుంది’ అని తెలిపారు. 27న ‘దేవర’ రిలీజ్ ఉండటంతో తెలుగులో ఒకరోజు లేట్‌గా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 24, 2024

బెంగళూరు ఖాళీ అవుతుంది: ఇన్‌ఫ్లుయెన్సర్ వ్యాఖ్యలపై దుమారం

image

ఉత్త‌ర భార‌త ప్ర‌జ‌లు బెంగ‌ళూరును వీడితే న‌గ‌రం మొత్తం ఖాళీ అవుతుంద‌ని, ఇక్క‌డ డ‌బ్బు కొర‌త ఏర్ప‌డుతుందని ఒక ఇన్‌ఫ్లుయెన్స‌ర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ‘క‌న్న‌డిగులు త‌ర‌చూ మ‌మ్మ‌ల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ హేళన చేస్తుంటారు. మేము నిజంగానే వెళ్లిపోతే మీ న‌గ‌రం ఖాళీ అయిపోతుంది’ అంటూ సుగంధ్ శర్మ వ్యాఖ్యానించారు. కొంత మంది ఆమెపై భగ్గుమంటున్నారు. నగరం విడిచి వెళ్లాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

News September 24, 2024

పంటలకు తెగుళ్లు.. రైతులకు సూచనలు ఇవ్వాలని మంత్రి ఆదేశాలు

image

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలకు తెగుళ్ల బెడద పెరిగి రైతులు అల్లాడిపోతున్నారు. వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు, పత్తిలో రసం పీల్చే పురుగుల, మెగ్నీషియం లోపం ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలతో కలిసి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తెగుళ్ల నివారణ కోసం రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు.