News September 24, 2024

అమరావతిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన

image

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15వేల కోట్ల మేర రుణం అందిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు మరోసారి అమరావతిలో పర్యటించారు. లింగాయపాలెం గ్రామస్థులతో భేటీ అయ్యారు. భూసమీకరణ, రైతు కూలీల జీవన ప్రమాణాలు, వారి స్థితిగతులపై చర్చించారు. అనంతరం వీఐటీ వర్సిటీలో యాజమాన్య ప్రతినిధులతో సమావేశమయ్యారు.

Similar News

News September 24, 2024

BIG ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, NLG, SRPT, RR, VKB, SRD, మెదక్, కామారెడ్డి, MBNR, NGKL, WNP, NRPT, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL, కర్నూలు, నంద్యాల, YSR, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

News September 24, 2024

ట్రిపుల్ ఐటీల్లో రేషన్ బియ్యంతో భోజనం: TDP ఎమ్మెల్సీ

image

AP: ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని టీడీపీ MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌కు ఆయన లేఖ రాశారు. నిర్వాహకులు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి విద్యార్థులకు పెడుతున్నారని ఆక్షేపించారు. మసూరి రకం బియ్యాన్నే వాడాలన్న నిబంధనను పట్టించుకోవట్లేదని విమర్శించారు. IIITల్లో క్యాంటీన్లు, దుకాణాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాలని కోరారు.

News September 24, 2024

టీడీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: జూపూడి

image

ఏపీలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ‘మెడికల్ కాలేజీలో ఎస్సీ డాక్టర్‌ను దూషించిన MLA పంతం నానాజీని పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంబేడ్కర్ ప్లెక్సీని తగులబెట్టిన MLA రఘురామకృష్ణం రాజు క్షమాపణలు తెలపాలి. దళితులంతా వైసీపీకి మద్దతు ఇస్తున్నందుకు కక్ష గట్టారు. టీడీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది’ అని హెచ్చరించారు.