News September 24, 2024

‘సత్యం సుందరం’ అరుదైన సినిమా: కార్తీ

image

అరవింద్ స్వామి, కార్తీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సత్యం సుందరం’ ఈ నెల 28న విడుదల కానుంది. ‘96’ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. తమ మూవీ చాలా అరుదైన స్టోరీతో వస్తోందని కార్తీ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నాకు కె. విశ్వనాథ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఇది సరిగ్గా ఆయన సినిమాల తరహాలోనే ఉంటుంది’ అని తెలిపారు. 27న ‘దేవర’ రిలీజ్ ఉండటంతో తెలుగులో ఒకరోజు లేట్‌గా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 24, 2024

ఇంతకు ముందెన్నడూ చూడని ప్రో అమెరికన్ పీఎం మోదీ: US రాయబారి

image

నరేంద్రమోదీ, జో బైడెన్ మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉందని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ అన్నారు. 2 దేశాల్లోని ప్రజలకు వారిద్దరూ ప్రతినిధులని పేర్కొన్నారు. ‘భారత చరిత్రలోనే మోదీలాంటి ప్రో అమెరికన్ పీఎంను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఇక అమెరికా చరిత్రలో అత్యంత ప్రో ఇండియన్ ప్రెసిడెంట్ బైడెన్’ అంటూ ఆయన వర్ణించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి సమస్యల పరిష్కారానికే క్వాడ్ ఉందన్నారు.

News September 24, 2024

తిరుమలలో రూ.22 కోట్లతో FSSAI ల్యాబ్

image

తిరుమలలో ₹22 కోట్లతో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI సిద్ధమైంది. ఇందుకోసం 12000 చదరపు అడుగుల స్థలాన్ని TTD కేటాయించింది. లడ్డూ, అన్నదానం, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లకు పైగా విలువైన పదార్థాలను TTD ఏటా కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలనకు FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయాలని TTD ఇటీవల కోరింది. ఇందులో ₹5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, ₹9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, ₹6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు.

News September 24, 2024

పారిపోయి కొండల్లో దాక్కున్న విద్యార్థులు!

image

AP: పల్నాడు(D) వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు. మరో 37మంది కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని, బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండటంతో వారు పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు.