News September 24, 2024

పాము కాటుతో వ్యక్తి మృతి.. గ్రామస్థులు ఆ పామును ఏం చేశారంటే

image

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన దిగేశ్వర్(22) అనే వ్యక్తిని కట్లపాము కాటేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. ఆ పామును పట్టుకున్న స్థానికులు మృతుడి చితిపై దాన్ని బతికుండానే తగులబెట్టారు. ఇంకెవరిని చంపుతుందోనన్న భయంతోనే ఇలా చేశామని తెలిపారు. దీనిపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. పాముల గురించి, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Similar News

News September 24, 2024

విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం

image

AP: విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం 30 ఎకరాలు సేకరించాలని, రూ.200 కోట్లతో పనులు తక్షణమే ప్రారంభించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అటు హిజ్రాలకు సింగిల్ రేషన్‌కార్డు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిన్న దివ్యాంగుల సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం వెల్లడించారు.

News September 24, 2024

పొటాటోతో బయో ఫ్యూయల్!

image

తమ టెక్నాలజీని పరీక్షించేందుకు పొటాటో వేస్ట్, పీల్స్‌ను ఇథనాల్‌గా మార్చే పైలట్ ప్లాంట్‌ ఏర్పాటును CPRI ప్రతిపాదించినట్టు తెలిసింది. వీటిద్వారా బయో ఫ్యూయల్ తయారీని ఇప్పటికే ల్యాబుల్లో టెస్ట్ చేశారు. చైనా తర్వాత ఎక్కువగా పొటాటో పండించేది భారతే. ఏటా 56 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేస్తుంది. కుళ్లడం, చిప్స్ ప్రాసెస్ తర్వాత 10% వృథా అవుతోంది. ఇథనాల్ ఫీడ్‌స్టాక్‌గా కుళ్లిన పొటాటోను వాడేందుకు అనుమతి ఉంది.

News September 24, 2024

రేపటి నుంచి ప్రజల ముందుకు మంత్రులు

image

TG: కాంగ్రెస్ చేపట్టిన ‘మంత్రులతో ప్రజల ఫేస్ టు ఫేస్’ రేపు ప్రారంభం కానుంది. ప్రతి బుధ, శుక్రవారాల్లో గాంధీభవన్‌లో ఉ.11-మ.2గంటల మధ్య మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. రేపు మంత్రి దామోదర రాజనర్సింహ, 27న శ్రీధర్ బాబు, అక్టోబర్ 4న ఉత్తమ్, 9న పొన్నం, 11న సీతక్క, 16న కోమటిరెడ్డి, 18న సురేఖ, 23న పొంగులేటి, 25న జూపల్లి, 30న తుమ్మల ప్రజలతో మాట్లాడనున్నారు.