News September 24, 2024

TET: సందేహాల నివృత్తి కోసం ఫోన్ నంబర్లివే..

image

AP: టెట్ హాల్ టికెట్లలో తప్పులు ఉంటే పరీక్షా కేంద్రాల వద్ద నామినల్ రోల్స్‌లో సరి చేయించుకోవచ్చని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు ఈమెయిల్‌(grievences.tet@apschooledu.in)లో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు ఇవే.. 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618.

Similar News

News September 24, 2024

క్రికెట్ చరిత్రలోనే పంత్ ఓ అద్భుతం: గిల్‌క్రిస్ట్

image

టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ది గ్రేటెస్ట్ కంబ్యాక్ అని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసించారు. ‘పంత్ నాకంటే దూకుడుగా ఆడతాడు. ఎవరి బౌలింగ్‌లోనైనా ఎలాంటి భయం లేకుండా ఆడటం నాకు నచ్చుతుంది. ఆటలో ఎప్పుడు దూకుడుగా ఆడాలో, ఎప్పుడు వేగం తగ్గించాలో తనకు తెలుసు’ అని ఆయన పేర్కొన్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ తొలి మ్యాచ్‌లో (39, 109) రాణించారు.

News September 24, 2024

విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం

image

AP: విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం 30 ఎకరాలు సేకరించాలని, రూ.200 కోట్లతో పనులు తక్షణమే ప్రారంభించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అటు హిజ్రాలకు సింగిల్ రేషన్‌కార్డు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిన్న దివ్యాంగుల సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం వెల్లడించారు.

News September 24, 2024

పొటాటోతో బయో ఫ్యూయల్!

image

తమ టెక్నాలజీని పరీక్షించేందుకు పొటాటో వేస్ట్, పీల్స్‌ను ఇథనాల్‌గా మార్చే పైలట్ ప్లాంట్‌ ఏర్పాటును CPRI ప్రతిపాదించినట్టు తెలిసింది. వీటిద్వారా బయో ఫ్యూయల్ తయారీని ఇప్పటికే ల్యాబుల్లో టెస్ట్ చేశారు. చైనా తర్వాత ఎక్కువగా పొటాటో పండించేది భారతే. ఏటా 56 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేస్తుంది. కుళ్లడం, చిప్స్ ప్రాసెస్ తర్వాత 10% వృథా అవుతోంది. ఇథనాల్ ఫీడ్‌స్టాక్‌గా కుళ్లిన పొటాటోను వాడేందుకు అనుమతి ఉంది.