News September 24, 2024

ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త

image

TG:బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, బీమా రంగాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 10 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దేశంలో తొలిసారిగా ఓ కోర్సును తీసుకొస్తోంది. దీనిని ఈ నెల 25న CM రేవంత్ ప్రారంభిస్తారు. 18 ఇంజినీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో అమలు చేసి కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్, ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉద్యోగమూ లభించేలా చూస్తారు.

Similar News

News September 24, 2024

KTR కనిపించడం లేదని ఫిర్యాదు

image

TG: తమ ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదని సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట బీజేపీ నేత కోడె రమేశ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నియోజకవర్గంలోని పలు గ్రామాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. కానీ పట్టించుకునే తీరిక ఆయనకు లేకుండా పోయింది. ప్రచార ఆర్భాటాలు తప్ప పనులు పూర్తి చేయడంలో కేటీఆర్‌కు ఆసక్తి లేదు. తమ MLA ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News September 24, 2024

వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

image

AP: YCP నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చారు. తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మారెడ్డే ప్రధాన కారణం. ఇంత జరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. YCP నేతలు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడొద్దు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 24, 2024

స్కూల్‌కి రూ.125 కోట్ల విరాళం.. నెట్టింట భిన్నాభిప్రాయాలు!

image

ఫేస్‌బుక్ కోఫౌండర్ ఎడ్వర్డో సావెరిన్ గొప్ప మనసు చాటుకున్నారు. సింగపూర్ అమెరికన్ స్కూల్‌‌కు $15.5M (₹125 కోట్లు) విరాళమిచ్చారు. స్కూల్ ఈ మొత్తాన్ని ల్యాబ్స్, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి ఖర్చు చేయనుంది. అయితే ఇదొక ప్రైవేట్ స్కూల్. ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి $47,000 ఫీజు వసూలు చేస్తుంది. ఇలాంటి ప్రైవేట్ స్కూల్‌కి కాకుండా చారిటీ స్కూల్స్‌కి డొనేట్ చేయాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.