News September 24, 2024
MBNR: ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

పాలమూరు జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-1098, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌లు ఉన్నాయి. SHARE IT
Similar News
News February 26, 2026
MBNR: ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం

2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఖుష్బూ గుప్త ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా నియామకం అయ్యారు. తొలుత బీహార్ కేడర్‌కు ఎంపికైన ఆమె, వివాహానంతరం తెలంగాణ కేడర్‌కు మారారు. ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఆమె 2018 యూపీఎస్సీ పరీక్షలో AIR 80 సాధించారు. పంజాబ్‌లోని భదౌర్ ఆమె స్వస్థలం. ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో గిరిజన బాలికల విద్యపై విశేష సేవలు అందించారు.
News February 26, 2026
మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్త

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా సేవలందించిన విజయేందిర బదిలీ కావడంతో, ప్రభుత్వం ఖుష్బూ గుప్తకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన ఆమె, జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
News February 25, 2026
జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్‌కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


