News September 24, 2024
ఉత్తరాంధ్ర రైల్వే డివిజన్ ఛైర్మన్‌గా కేంద్రమంత్రి

విశాఖపట్నంలో జరిగిన రైల్వే వాల్తేర్ డీఆర్ఎం సమావేశంలో ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ధి పనులపై చర్చించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం-సికింద్రాబాద్ తిరుపతికి కొత్త రైళ్లను, రోజువారి ప్రయాణికుల కోసం శ్రీకాకుళం-విశాఖను కలిపే నమో-భారత్ సర్వీసును ప్రారంభించాలని అధికారులను కేంద్రమంత్రి కోరారు. డివిజన్ ఛైర్మన్‌గా ఎంపిక చేసినందకుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 10, 2025
శ్రీకాకుళం: హోంగార్డుకు ఆర్థిక చేయూత

ఇటీవల రిటైర్ అయిన హోంగార్డు తిరుపతి రావుకు సహచర హోంగార్డులు ఒక్కరోజు గౌరవ వేతనం రూ. 4.11 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదగా నగదు చెక్కును ఆయనకు అందజేశారు. సహచర పోలీసు సిబ్బంది చూపిన ఈ సహకారం ప్రశంసనీయమని ఎస్పీ అన్నారు. పోలీసు కుటుంబం ఎప్పుడూ ఐకమత్యంగా ఉండాలని ఎస్పీ కోరారు.
News November 10, 2025
బూర్జ: ‘గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు అన్నారు. ఆదివారం బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ కొత్త ఊరు గ్రామంలో రూ.13.40 లక్షలతో నిర్మించనున్న మంచినీటి ట్యాంక్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ట్యాంక్ ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కానుందని అన్నారు.
News November 9, 2025
ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.


