News September 24, 2024
బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: విశాఖ రేంజ్ డీఐజీ

దీపావళి పండుగకు బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి అని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జట్టి శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి సూచిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో బాణాసంచా నిల్వలు, తయారీ, విక్రయాలు తదితర వాటిపై నిఘా ఉంచాలన్నారు.
Similar News
News March 1, 2026
రణస్థలం: మామకు తలకొరివి పెట్టిన కోడలు

రణస్థలం కాపువీధికి చెందిన కె.రామప్పడు అనే విశ్రాంత ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన కోడలు ఉమా మామ మృతదేహానికి తలకొరివి పెట్టింది. రామప్పడు భార్య చిన్నమ్మడు, కుమారులు అప్పన్న, రాంబాబు కొన్నాళ్ల క్రితం మృతిచెందగా అనారోగ్యానికి గురైన మామకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
News March 1, 2026
శ్రీకాకుళం డయేరియా.. మరో ఇద్దరు అధికారుల సస్పెండ్

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన ఘటనలో మున్సిపల్ కమీషనర్‌ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి సరఫరా విభాగం డీఈఈ జగన్మోహన్, దమ్మలవీధిలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శరత్‌ను విధులు నుంచి తొలగిస్తూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ శనివారం ఉత్తర్వులు జరిచేశారు. ఎమ్‌హెచ్ఓ సుధీర్, ఇంచార్జ్ ఈఈ కమలాకర్‌తో పాటు మరికొందరకి షోకాజ్ నోటీలుసు జారీ చేశారు. మరికొంతమంది అధికారులకు వేటుపడే అవకాశముంది.
News March 1, 2026
SKLM: ‘పటిష్ఠమైన భద్రత ఉన్న భవనంలో మాదకద్రవ్యాల నిల్వ ఉంచాలి’

పటిష్ఠమైన భద్రత ఉన్న భవనంలో పట్టుబడిన మాదకద్రవ్యాలు నిల్వ ఉంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం పాత వంశధార క్వార్టర్స్‌లోని భవనాలను కలెక్టర్‌తో పాటు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. భవనం చుట్టూ ఫ్లడ్ లైట్లు, నిరంతర నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.


