News September 24, 2024

ఆర్టీసీ ఉద్యోగులకు రూ.25వేల రుణం

image

AP: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, సహకార సంఘం సభ్యులకు రూ.25 వేల వరద రుణం మంజూరు చేయాలని ఆ సంఘం నిర్ణయించింది. వరదలతో పూర్తిగా నష్టపోయిన వారికి ఈ రుణాన్ని అందిస్తారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని డిపోలు, విజయవాడలోని నాన్ ఆపరేషన్ యూనిట్లు, ఎండీ కార్యాలయంలో పని చేసే వారికి ఇది వర్తిస్తుందని సంఘం కార్యదర్శి తెలిపారు. రుణం కావాల్సిన వారు సంబంధిత డిపో, యూనిట్ మేనేజర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News September 24, 2024

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా చంద్రబాబు: YCP

image

AP:తిరుమల లడ్డూ విషయంలో TTD EO, CM మాటలకు పదేపదే తేడాలేంటని YCP ప్రశ్నించింది. ‘వెజిటబుల్ ఫ్యాట్స్ గుర్తించామని జులై 23న EO చెబితే, యానిమల్ ఫ్యాట్స్ అని CM అన్నారు. ఆ తర్వాత EO యానిమల్ ఫ్యాట్స్ అన్నారు. నాణ్యత లేదని 4 ట్యాంకర్ల నెయ్యి వాడలేదని EO చెప్పారు. CM 2-3 ట్యాంకర్లు ఆలయంలోకి వెళ్లాయన్నారు. లోకేశ్ నిన్న 4 ట్యాంకర్లు వెనక్కి పంపామన్నారు. దేవుడి విషయంలో ఎందుకిన్ని డ్రామాలు?’ అని నిలదీసింది.

News September 24, 2024

ఘోరం.. నర్సింగ్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్

image

కోల్‌కతా లేడీ డాక్టర్‌పై హత్యాచార ఘటన మరవకముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. దిండిగల్ జిల్లాలో స్వస్థలం తెని నుంచి బయలుదేరిన ఓ నర్సింగ్ స్టూడెంట్‌ను కొందరు దుండగులు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. పోలీసులు ఆమెను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

News September 24, 2024

తారక్‌కి బెస్ట్ విషెస్: మంత్రి కోమటిరెడ్డి

image

‘దేవర’ టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన <<14179153>>ట్వీట్‌కు<<>> మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ‘దేవర రిలీజ్ సందర్భంగా తారక్‌కి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తూనే ఉంటుంది’ అని తెలిపారు. ఈనెల 27న ‘దేవర’ విడుదలవనుంది.