News September 24, 2024

హజ్ యాత్రకు రూ.లక్ష సాయం: CM

image

AP: హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష, మసీదుల నిర్వహణ కోసం రూ.5వేలు సాయం అందించే స్కీమ్‌లకు రూపకల్పన చేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించారు. పాస్టర్లకు నెలకు రూ.5వేలు, ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ.10 వేలు, రూ.5వేల గౌరవ వేతనం, MSMEలకు రాయితీ రుణాలు ఇస్తామన్న హామీలను అమల్లోకి తీసుకురావాలన్నారు. వక్ఫ్ భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.

Similar News

News November 7, 2025

కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.

News November 7, 2025

చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

News November 7, 2025

PHOTO: రాజ్ నిడిమోరుతో సమంత

image

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం వేళ ఇన్‌స్టాలో సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఓ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సామ్, రాజ్ క్లోజ్‌గా ఉన్న ఫొటో కూడా ఉంది. గత ఏడాదిన్నరగా తన జీవితంలో కొన్ని బోల్డ్ డెసిషన్‌లు తీసుకున్నానని, అందుకు కృతజ్ఞతగా ఉన్నట్లు ఆమె రాసుకొచ్చారు. దీంతో రాజ్‌తో తన బంధాన్ని ఆమె బహిరంగంగానే ప్రకటించారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.