News September 24, 2024
మోదీలాంటి నాయకుడుంటే ‘$7ట్రిలియన్ల ఎకానమీ’ సాధ్యమే: JP మోర్గాన్

‘$7ట్రిలియన్ల ఎకానమీ’ని భారత్ సాధించగలదని JP మోర్గాన్ CEO జేమీ డిమాన్ అన్నారు. ఇందుకు PM మోదీలాంటి బలమైన నాయకత్వం అవసరమన్నారు. ‘ఆధార్, బ్యాంకింగ్ A/Cs, GST రిఫార్మ్స్, ఇన్ఫ్రా బిల్డింగ్, నియంత్రణల తగ్గింపు సంపన్నులకే కాకుండా దేశం, తక్కువ ఆదాయ వర్గాలకూ సాయపడ్డాయి. గతంతో పోలిస్తే దేశం మరింత డెవలప్ అయింది. మేమిక్కడి నుంచే ఎందరో క్లైంట్లకు సేవలందిస్తున్నాం. మాకు 55వేల ఉద్యోగులున్నారు’ అని చెప్పారు.
Similar News
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <
News January 16, 2026
ఆయుధం పట్టకుండా జ్ఞాన యుద్ధం చేసిన విదురుడు

మహాభారతంలో విదురుడు ఆయుధం పట్టకుండానే జ్ఞాన యుద్ధం చేశారు. కత్తి కంటేమాట పదునైనదని నమ్మి, తన వాక్చాతుర్యంతో కురువంశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. ధృతరాష్ట్రుడి అంధకార బుద్ధికి దిక్సూచిగా ఉంటూ, దుర్యోధనుడి దురాలోచనలను ముందే పసిగట్టి హెచ్చరించారు. ధర్మం వైపు నిలబడి ఆయన చేసిన ప్రతి సూచన అహంకారంపై సాగిన భీకర పోరాటం. దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద గెలుపును విదురుని జీవితం మనకు చెబుతుంది.
News January 16, 2026
రూ.238కోట్లు కలెక్ట్ చేసిన ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో రూ.238కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ సైజ్ బ్లాక్‌బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించారు.


