News September 24, 2024
అక్టోబర్ 15 నుంచి ‘ఇందిరమ్మ’ అర్హుల ఎంపిక: మంత్రి

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధివిధానాలను వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందించే విషయంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Similar News
News January 12, 2026
మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు

AP: మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99 MRP ఉన్న మద్యం బాటిళ్లు, బీర్లు, వైన్ బాటిళ్లు మినహా మిగతావాటికి రూ.10 చొప్పున పెంచింది. దీంతో ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది.
News January 12, 2026
గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండవచ్చా?

ఇంటి గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండటం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ఈ నిర్మాణం బయట నుంచి వచ్చే సహజ గాలి, వెలుతురును అన్ని గదుల్లోకి ప్రసరించేలా చేస్తుందంటున్నారు. ‘ఇది గదిలో ఉండే వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇల్లు ఎప్పుడూ తాజాదనంతో ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత తగ్గి, గృహస్థులు ఉత్సాహంగా తమ జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 12, 2026
జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10న అర్ధరాత్రి 2 సార్లు స్పృహతప్పి పడిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేసినట్లు చెప్పింది. 2025 మార్చిలోనూ ఆయన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య కారణాలతో గతేడాది జులైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన <<17154846>>రాజీనామా<<>> చేయడం తెలిసిందే.


