News September 24, 2024

అంబానీ కుమారుడికి సెబీ ఫైన్

image

అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీకి సెబీ షాకిచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో అవకతవకల కేసులో రూ.కోటి ఫైన్ వేసింది. కంపెనీ జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ రూల్స్‌ను ఆయన పాటించలేదని చెప్పింది. వీసా క్యాపిటల్ పార్ట్‌నర్స్, అక్యూరా ప్రొడక్షన్ కంపెనీలకు రూ.20 కోట్ల చొప్పున అన్ సెక్యూర్డ్ లోన్లకు అనుమతించారని వెల్లడించింది. తాము పంపిన ఈ‌మెయిల్స్‌కు ‘ఓకే’ అని బదులివ్వడమే దీనికి నిదర్శనమంది.

Similar News

News September 24, 2024

లడ్డూలో పొగాకు పొట్లం వార్తలను ఖండించిన TTD

image

తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తోన్న <<14180009>>ఆరోపణలను<<>> టీటీడీ కొట్టిపారేసింది. ‘పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం’ అని ప్రకటన విడుదల చేసింది.

News September 24, 2024

స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి: వెట్రిమారన్

image

సినిమా ఇండస్ట్రీ గట్టెక్కాలంటే స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ సూచించారు. కరోనా తర్వాత థియేటర్లు ఆర్థిక ఒడిదొడుకులకు గురయ్యాయని తెలిపారు. కొన్ని ఓటీటీ వేదికలు స్టార్ హీరోల సినిమాల కోసం భారీ మొత్తాలు చెల్లించడం వల్ల పరిశ్రమలో అసమతుల్యత ఏర్పడిందన్నారు. దీని వల్ల హీరోలు రెమ్యునరేషన్ పెంచారని, తద్వారా సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతోందని వివరించారు.

News September 24, 2024

ఆర్థిక సాయం పెంచుతూ ఉత్తర్వులు

image

AP: వరదల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన దానికంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు రూ.11వేలకు బదులుగా రూ.25 వేలు ఇవ్వనున్నారు. మొదటి ఫ్లోర్‌లో ఉన్నవారికి రూ.10 వేలు, దుకాణాలకు, పంటలకు హెక్టారుకు రూ.25 వేలు అందించనున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది.