News September 24, 2024
KTR కనిపించడం లేదని ఫిర్యాదు

TG: తమ ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదని సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట బీజేపీ నేత కోడె రమేశ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నియోజకవర్గంలోని పలు గ్రామాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. కానీ పట్టించుకునే తీరిక ఆయనకు లేకుండా పోయింది. ప్రచార ఆర్భాటాలు తప్ప పనులు పూర్తి చేయడంలో కేటీఆర్‌కు ఆసక్తి లేదు. తమ MLA ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్‌లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.
News November 11, 2025
లంకలో హనుమంతుడు ఎడమ కాలు ఎందుకు మోపాడు?

ఆంజనేయుడు, రావణుడి అశుభాన్ని కోరి లంకలో ఎడమ పాదం మోపాడు. దాని ఫలితంగా లంక సర్వనాశనం అయింది. ఎడమ పాదం అశుభాలు, విభేదాలకు దారి తీస్తుంది. దీనికి విరుద్ధంగా, మన సంప్రదాయం ప్రకారం కుడిపాదం మోపి ఇంట ప్రవేశించడం సకల శుభాలకు, సంపదకు ప్రతీక. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింట కుడి కాలు మోపడం వలన శాంతి, ఉన్నతి, సంతోషం కలుగుతాయి. కాబట్టి, ఇతరుల బాగును, క్షేమాన్ని కోరుతూ ఎల్లప్పుడూ కుడిపాదాన్నే ఉపయోగించాలి.
News November 11, 2025
రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్‌కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.


