News September 24, 2024

నెల్లిమర్ల మద్యం గోడౌన్ వద్ద వైన్ షాప్ ఉద్యోగుల ఆందోళన

image

జిల్లావ్యాప్తంగా వైన్ షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్థానిక ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ గోడౌన్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సయిజ్ సీఐ శ్రీనివాస్, నెల్లిమర్ల ఎస్సై గణేష్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Similar News

News February 13, 2026

గంట్యాడ: పచ్చకామెర్లతో యువకుడి మృతి

image

గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు పచ్చకామెర్లతో మృతి చెందాడు. కోన పవన్ కుమార్ (22) జ్వరం, పచ్చకామెర్లు రావడంతో 5 రోజుల క్రితం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. పవన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉన్న పవన్‌‌ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

News February 13, 2026

హ్యూమన్ రైట్స్ పేరుతో బెదిరింపులు చేస్తే జైలుకే: ఎస్పీ

image

హ్యూమన్ రైట్స్ కమిషన్, RTI ప్రతినిధులమని చెబుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. గ్రామస్థాయిలో ఇటువంటి సంస్థలకు ఎటువంటి ప్రైవేట్ ప్రతినిధులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గుర్తింపు కార్డులు చూపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.