News September 24, 2024

స్వర్ణాంధ్ర విజన్ @ 2047ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్@2047 ప్లాన్ ద్వారా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్ నుంచి swarnandhra.ap.gov.in/Suggestions లింక్‌తో వచ్చే QR కోడ్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. 1.పేరు, 2.ఫోన్ నంబర్‌ 3.OTP, 4.జిల్లా పేరు, 5.వయసు, 6.లింగం, 7.వృత్తి, 8.ఇ-మెయిల్ చిరునామాను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.

Similar News

News January 10, 2026

తెనాలిలో అర్ధరాత్రి ఏసీ మెకానిక్ దారుణ హత్య

image

తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్(52) హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగులు ఫయాజ్‌ను కొట్టి చంపి పడవేశారు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో కర్రలు, రాడ్లు ఉన్నట్లు గుర్తించారు. సీఐ సాంబశివరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.

News January 10, 2026

VJA: దుర్గమ్మ శ్రీచక్రార్చన పాలలో పురుగు.. వాస్తవమెంత?

image

దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. ప్రతిరోజూ అమ్మవారికి నిర్వహించే శ్రీచక్రార్చన కోసం సిద్ధం చేసిన పాల ప్యాకెట్లలో ఒక దానిలో పురుగు కనిపించింది. అర్చకులు వెంటనే ఆ పాలను పక్కన పడేసి ఇతర పాలతో అర్చన పూర్తి చేశారు. కొన్నేళ్లుగా ప్యాకెట్ పాలు, విడిగా ఆవుపాలను సేకరిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదని, ఈ విషయాన్ని కొందరు కావాలనే పెద్దది చేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.

News January 10, 2026

గుంటూరులో నేటి నుంచి UTF రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

image

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి గుంటూరులో ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు గుంటూరు ఆంధ్రా క్రైస్తవ కళాశాల వేదికగా నిలవనుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో పాటూ, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేశారు.