News September 24, 2024
SEEDAP ఛైర్మన్‌గా దీపక్ రెడ్డి

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన గూనపాటి దీపక్ రెడ్డిని ప్రభుత్వం SEEDAP ఛైర్మన్‌గా నియమించింది. ఆయన 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కి అల్లుడు. టీడీపీలో కీలకంగా ఉన్నారు.
Similar News
News January 25, 2026
అనంత జిల్లాలో రథసప్తమి ఎఫెక్ట్.. తగ్గిన ధరలు

అనంతపురం జిల్లాలో రథసప్తమి సందర్భంగా ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260, అనంతపురంలో రూ.240, స్కిన్ లెస్ రూ.260 కళ్యాణదుర్గంలో రూ.280 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. చికెన్ ధరలు తగ్గడంతో మాంసప్రియులు హర్షం వ్యక్తం చేశారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
News January 25, 2026
ATP: ‘గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలి’

77వ గణతంత్ర దినోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం అనంతపురం నగరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పోలీసు పరేడ్ మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.
News January 25, 2026
గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్ష

గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. పోలీసు పెరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఫ్లాగ్ హోయిస్టింగ్, కవాతు, తాగునీరు, సీటింగ్, స్టాల్స్, శకటాల ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదన్నరు.


