News September 24, 2024

స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి: వెట్రిమారన్

image

సినిమా ఇండస్ట్రీ గట్టెక్కాలంటే స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ సూచించారు. కరోనా తర్వాత థియేటర్లు ఆర్థిక ఒడిదొడుకులకు గురయ్యాయని తెలిపారు. కొన్ని ఓటీటీ వేదికలు స్టార్ హీరోల సినిమాల కోసం భారీ మొత్తాలు చెల్లించడం వల్ల పరిశ్రమలో అసమతుల్యత ఏర్పడిందన్నారు. దీని వల్ల హీరోలు రెమ్యునరేషన్ పెంచారని, తద్వారా సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతోందని వివరించారు.

Similar News

News September 24, 2024

జగన్.. తిరుమల అంటే ద్వేషం ఎందుకు?: టీడీపీ

image

AP:తిరుమల అంటే ఎందుకంత ద్వేషమంటూ మాజీ సీఎం జగన్‌పై TDP Xలో ప్రశ్నల వర్షం కురిపించింది. ‘దోపిడీ చేయడానికే నీ బంధువులను TTD ఈవో, ఛైర్మన్లుగా పెట్టావా? భక్తులను స్వామివారికి దూరం చేయడానికే ధరలు పెంచావా? కమీషన్ల కోసమే నందిని నెయ్యి సరఫరాను ఆపేశావా? నెయ్యి సప్లైలో నిబంధనలు ఎందుకు మార్చావ్? రూ.320కే కేజీ స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందని అప్రూవ్ చేశావు? కోర్టుకు ఎందుకు వెళ్లావు?’ అని ప్రశ్నించింది.

News September 24, 2024

అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దు: హైడ్రా

image

TG: బఫర్ జోన్, FTL పరిధిలో అక్రమ నిర్మాణాల కట్టడికి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాసింది. రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో సమావేశమై సూచనలు చేయనున్నారు. దీని కోసం ఒక లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల కూల్చిన అక్రమ కట్టడాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల లిస్టును సిద్ధం చేశారు.

News September 24, 2024

లెబనాన్‌లో 558కి పెరిగిన మృతుల సంఖ్య

image

హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై 2 రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య 558కి పెరిగింది. ఈ మేరకు లెబనీస్ ఆరోగ్య శాఖ తెలిపింది. లెబనాన్ సరిహద్దుల నుంచి హెజ్బొల్లాను తరిమేందుకు అవసరమైనదంతా చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు గాజాలోని ఖాన్ యూనిస్‌ నగరంపై జరిపిన దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. వరుస దాడులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ అదృశ్యమయ్యాడు. అతని జాడ కోసం ఇజ్రాయెల్ వెతుకుతోంది.