News September 24, 2024

దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోండి: కేటీఆర్

image

TG: హైడ్రా పేరుతో పేదల బతుకులను ప్రభుత్వం రోడ్డుపై వేస్తుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నిర్మాణ అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Similar News

News September 24, 2024

బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!: అంబటి రాంబాబు

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ SIT బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!’ అని ట్వీట్ చేశారు. కాగా, లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

News September 24, 2024

జియో సరికొత్త ప్లాన్

image

టెలికం దిగ్గజం జియో సరికొత్త ప్లాన్‌ను యూజర్ల కోసం తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో ఉండే ఈ ప్లాన్‌ను రూ.999కు అందిస్తోంది. ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 SMSలు పంపవచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. రీఛార్జ్ ధరలు పెంచి జియో ఇప్పటికే వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

News September 24, 2024

రాజ్యసభలో తగ్గుతోన్న వైసీపీ బలం

image

రాజ్యసభలో వైసీపీ బలం తగ్గిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 11 నుంచి 8కి పడిపోయింది. ఇటీవల ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా ఆర్.కృష్ణయ్య సైతం పార్టీని వీడారు. మరికొంత మంది కూడా వైసీపీకి గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతోంది.