News September 24, 2024
ట్విటర్‌లో బ్లాకింగ్ ఆప్షన్ మారుస్తా: మస్క్
ట్విటర్‌లో బ్లాకింగ్ ఆప్షన్‌ను మారుస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. బ్లాక్ చేసినంత మాత్రాన ప్రొఫైల్ కనిపించకపోవడం అర్థరహితమని అభిప్రాయపడ్డారు. ‘బ్లాక్ చేసిన వారితో ఇంటరాక్ట్ అవడం కుదరదు. కానీ బ్లాక్ అయిన వారు బ్లాక్ చేసిన వారి పోస్టుల్ని, ప్రొఫైల్‌ని చూడగలిగేలా మారుస్తాం’ అని పేర్కొన్నారు. అయితే తమను వేధించేవారిని బ్లాక్ చేశాక కూడా తమ పోస్టులు వారికి ఎందుకు కనిపించాలంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News December 21, 2024
వైభవ్ సూర్యవంశీ మరో ఘనత
బిహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ (13 yrs 269 days)నిలిచారు. ఇవాళ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఆయన లిస్ట్-ఏ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ (14 yrs 51 days) ఉండేది. కాగా ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడైన పిన్న వయస్కుడిగానూ వైభవ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
News December 21, 2024
వివాదం కోరుకోవడం లేదంటూనే బన్నీ విమర్శలు
ప్రభుత్వంతో వివాదం కోరుకోవడం లేదంటూనే TG CMకు బన్నీ కౌంటర్ ఇచ్చారు. పర్మిషన్ లేకున్నా రోడ్ షో చేశారని అసెంబ్లీలో రేవంత్ అంటే, రావద్దని పోలీసులు అప్పుడే చెబితే వెనక్కి వెళ్లేవాన్నని బన్నీ చెప్పారు. ఇక అది రోడ్ షో కాదని, కార్‌పై నుంచి చేయి ఊపానన్నారు. అటు ప్రమాదం గురించి చెప్పి, వెళ్లాలని పోలిస్ హెచ్చరించినా మళ్లీ చేతులూపుతూ వెళ్లారని CM అన్నారు. అయితే తనకు వారు ఏమీ చెప్పలేదని బన్నీ పేర్కొన్నారు.
News December 21, 2024
మినీ ఇండియాలా కువైట్: ప్రధాని మోదీ
కువైట్‌ను చూస్తోంటే మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశంలో ఇంతమంది భారతీయులను చూడటం సంతోషంగా ఉందని చెప్పారు. ‘కువైట్ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించే చెబుతుంటారు. విదేశీ కరెన్సీ ఆర్జనలో భారత్ టాప్‌లో ఉంది. మీరంతా కష్టపడటం వల్లే ఇది సాధ్యమైంది. భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలే కాదు.. విడదీయలేని మైత్రి కూడా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.