News September 24, 2024
Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి

స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో 84,914 వద్ద, నిఫ్టీ 1.35 పాయింట్ల లాభంతో 25,940 వద్ద స్థిరపడ్డాయి. బలమైన 26,000 మార్క్‌ను నిఫ్టీ అధిగమించినా ఎక్కువసేపు నిలవలేకపోయింది. సెన్సెక్స్ 84,816 పరిధిలో రెండుసార్లు సపోర్ట్ తీసుకుంది. Tata Steel, Hindalco, PowerGrid, TechM, టాప్ గెయినర్స్. Sbi Life, HindUnilvr, Grasim, Ultra Cemco టాప్ లూజర్స్.
Similar News
News November 10, 2025
కలలో శివయ్య కనిపిస్తే..?

‘కలలో శివుడిని/శివ లింగాన్ని చూడటం పవిత్రమైన సంకేతం. కలలో శివలింగం కనిపిస్తే దీర్ఘకాల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. పరమేశ్వరుని దర్శనం లభిస్తే, మీ ఆదాయం పెరిగి, అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శివుని మెడలో పాము కనిపిస్తే ఆర్థిక లాభాలుంటాయి. త్రిశూలం కనిపిస్తే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది’ అని స్వప్న శాస్త్రం చెబుతోంది.
News November 10, 2025
వారంతా మూర్ఖులు: ట్రంప్

తన పాలసీ టారిఫ్‌లను వ్యతిరేకించే వారంతా మూర్ఖులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీటి వల్లనే అమెరికా మరింత సంపన్న దేశంగా మారడంతో పాటు అత్యంత గౌరవనీయ దేశంగా మారిందని చెప్పారు. టారిఫ్‌ల వల్ల లక్షల కోట్ల డాలర్లు వస్తున్నాయని ప్రతి అమెరికన్‌కూ కనీసం 2వేల డాలర్ల చొప్పున డివిడెంట్ ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించడం ప్రారంభిస్తామన్నారు.
News November 10, 2025
శంకరుడి దశావతారాలు మీకు తెలుసా?

1. మహాకాలుడు – మహాకాళి,
2. తార్ – తార,
3. బాలభువనేశుడు – బాలభువనేశ్వరి,
4. షోడశశ్రీవిద్యేశుడు – షోడశశ్రీవిద్యేశ్వరి,
5. భైరవుడు – భైరవి,
6. చిన్న మస్తకుడు – చిన్న మస్తకి,
7. ధూమవంతుడు – ధూమవతి,
8. బగలాముఖుడు – బగళాముఖి,
9. మాతంగుడు – మాతంగి, 10. కమలుడు – కమల.


