News September 24, 2024
పవన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ మద్దతు

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతిచ్చారు. ఎవరైనా సనాతన ధర్మం జోలికి వస్తే హిందువులంతా గొంతెత్తుతామని చెప్పారు. సెక్యులరిజం రెండు దారులున్న వీధి లాంటిదన్నారు. ఇకపై తాము మౌనంగా ఉండబోమని బండి స్పష్టం చేశారు.
Similar News
News January 8, 2026
వెనిజులా ఆయిల్ ఎగుమతులను మేమే కంట్రోల్ చేస్తాం: అమెరికా

వెనిజులా క్రూడాయిల్ ఎగుమతులను తామే నియంత్రిస్తామని అమెరికా తెలిపింది. చమురు అమ్మకంతో వచ్చే ఆదాయాన్ని US అకౌంట్లలోనే ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లు ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ పేర్కొన్నారు. ముందుగా స్టోరేజ్‌లో ఉన్న ఆయిల్‌ను విక్రయిస్తామని చెప్పారు. 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను తమకు వెనిజులా అందజేస్తుందని నిన్న ట్రంప్ ప్రకటించారు. కాగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు మదురోను US <<18751661>>అరెస్టు<<>> చేయడం తెలిసిందే.
News January 8, 2026
మొక్కజొన్నలో భాస్వరం లోపం నివారణ ఎలా?

మొక్కజొన్న ఆకులు ఊదా, వంకాయ రంగులోకి మారితే అది భాస్వరం లోపం. చలి తీవ్రత వల్ల భూమిలో భాస్వరం ఉన్నా మొక్క తీసుకోలేదు. దీని వల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 10గ్రా. DAP లేదా 19:19:19 ఎరువును కరిగించి పంటపై పిచికారీ చేయాలి లేదా నానో DAP లీటరు నీటికి 2ml చొప్పున కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేస్తే మరింత లాభం.
News January 8, 2026
నీరసంగా ఉందా? ఈ ఫుడ్స్ తినండి

నీరసంగా ఉన్నప్పుడు తక్షణశక్తి కోసం కొన్ని ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. గుడ్లు, గింజలు, చీజ్, లీన్ మీట్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్లుండే పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా, అన్నం, నట్స్, ఫిష్, అవకాడో, బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్, టోఫు వంటివి తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుందని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి తినకూడదని చెబుతున్నారు.


