News September 24, 2024

ఆహార కల్తీ కట్టడికి యూపీ సీఎం అదేశాలు

image

UPలోని అన్ని భోజ‌న త‌యారీ హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో చెఫ్‌లు, వెయిట‌ర్లు త‌ప్ప‌క మాస్కులు, గ్లౌజులు ధ‌రించాల‌ని CM యోగి ఆదేశించారు. అలాగే CCTV కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని, నిర్వాహ‌కులు-య‌జ‌మానుల పేర్లు ప్ర‌ద‌ర్శించాల‌ని అదేశించారు. ఆహార కల్తీ ఘటనల నేప‌థ్యంలో నిర్వాహ‌కుల్లో జ‌వాబుదారీత‌నం పెంపున‌కు తాజా ఆదేశాలు ఇచ్చారు. ఆహార కల్తీని అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యమని యోగి పేర్కొన్నారు.

Similar News

News January 12, 2026

ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర ద్వారానే అమలవ్వాలి: కాటమనేని

image

AP: అంతరాయం లేకుండా ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలు మనమిత్ర యాప్ ద్వారా వాటిని అమలు చేయాలని IT కార్యదర్శి కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. ‘కొన్ని శాఖలు ఇప్పటికీ మాన్యువల్‌గా సేవలు కొనసాగిస్తున్నాయి. డేటా అనుసంధానం ప్ర‌క్రియ పూర్తి చేసి యూజ్ కేసెస్ సిద్ధం చేస్తున్నాం. AI ఆధారితంగా ఉప‌యోగ‌ప‌డే 98 కేసెస్‌ను ఇప్ప‌టికే సిద్ధం చేశాం. APR నాటికి పూర్తిగా వాటిని అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు.

News January 12, 2026

కేంద్ర బడ్జెట్.. దేశ చరిత్రలో తొలిసారి..

image

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.

News January 12, 2026

పండగకు ఏ చీర కొంటున్నారు?

image

పండుగ సమయంలో మంగళగిరి పట్టు చీర ధరిస్తే హుందాగా ఉంటుంది. ఇవి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ రకాల్లో మార్కెట్లో లభిస్తాయి. యువతులకైనా, మధ్యవయస్కులకైనా ఇవి సూపర్‌గా ఉంటాయి. పైథానీ పట్టు చీర మెరుస్తూ మంచి లుక్‌ ఇస్తుంది. గద్వాల్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పట్టులో కాకుండా ఫ్యాన్సీలో ట్రెండీగా కనిపించాలనుకుంటే ప్రింట్ చీరలు తీసుకోవచ్చు. ఏవి కట్టుకున్నా దాన్ని హుందాగా క్యారీ చేస్తే అందరి దృష్టీ మీ పైనే..