News September 24, 2024

ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబే: వైసీపీ

image

AP: లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబేనని YCP ట్వీట్ చేసింది. ‘TTDలో 6 నెలలకోసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. మార్చి 12, 2024న టెండర్లు పిలిచారు. మే 8న ఫైనలయ్యాయి. అప్పుడు ఎన్నికల కోడ్‌ నడుస్తోంది. టెండర్‌ దక్కించుకున్న AR డెయిరీ జూన్‌ 12 నుంచి సప్లై చేస్తోంది. జులై 6, 7 తేదీల్లో ట్యాంకర్లను అనలైజ్‌ చేసి ల్యాబ్‌కు పంపారు. ఇదంతా CBN హయాంలోనే జరిగింది’ అని పేర్కొంది.

Similar News

News September 24, 2024

‘కల్కి2898ఏడీ’ సీక్వెల్ టైటిల్ ఇదేనా?

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి2898ఏడీ’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీని సీక్వెల్‌పై నెట్టింట పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సీక్వెల్‌కు ‘కర్ణ3102బీసీ’ అని టైటిల్ నిర్ణయించారని.. కర్ణుడు, అశ్వత్థామ, యాస్కిన్‌ల చుట్టూ కథ తిరుగుతుందని ఆ వార్తల సారాంశం. మహాభారతం సమయంలో జరిగే సీన్లు ఎక్కువగా ఉంటాయని చర్చ నడుస్తోంది. 2028లో మూవీ రిలీజ్ కానుందని సమాచారం. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో చూడాలి.

News September 24, 2024

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

image

TG: మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించింది. ముందుగా రివర్ బెడ్‌లోని 1600 ఇళ్లను తొలగించనున్నట్లు సమాచారం. RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. పట్టా భూమి ఉంటే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించనుంది.

News September 24, 2024

దీప్తికి రూ.కోటి చెక్కు, మొగిలయ్యకు ఇంటి స్థలం

image

TG: పారాలింపిక్స్-2024లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి, వరంగల్‌లో 500 గజాల ఇంటిస్థలం, కోచ్‌కు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇక ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ గ్రహీత దర్శనం మొగిలయ్యకు HYD హయత్ నగర్‌లో 600 చదరపు గజాల ఇంటిస్థలం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.