News September 24, 2024

వరి ధాన్యం కనీస మద్దతు ధర రూ.2,300

image

AP: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కామన్ వెరైటీ ధాన్యానికి రూ.2,300, గ్రేడ్ ఏ రకానికి రూ.2,320 కనీస మద్దతు ధర చెల్లించాలని పేర్కొంది. రైతు సేవా, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈకేవైసీ వంటి వాటి ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశించింది. ఈ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

Similar News

News September 24, 2024

‘కల్కి2898ఏడీ’ సీక్వెల్ టైటిల్ ఇదేనా?

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి2898ఏడీ’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీని సీక్వెల్‌పై నెట్టింట పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సీక్వెల్‌కు ‘కర్ణ3102బీసీ’ అని టైటిల్ నిర్ణయించారని.. కర్ణుడు, అశ్వత్థామ, యాస్కిన్‌ల చుట్టూ కథ తిరుగుతుందని ఆ వార్తల సారాంశం. మహాభారతం సమయంలో జరిగే సీన్లు ఎక్కువగా ఉంటాయని చర్చ నడుస్తోంది. 2028లో మూవీ రిలీజ్ కానుందని సమాచారం. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో చూడాలి.

News September 24, 2024

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

image

TG: మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించింది. ముందుగా రివర్ బెడ్‌లోని 1600 ఇళ్లను తొలగించనున్నట్లు సమాచారం. RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. పట్టా భూమి ఉంటే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించనుంది.

News September 24, 2024

దీప్తికి రూ.కోటి చెక్కు, మొగిలయ్యకు ఇంటి స్థలం

image

TG: పారాలింపిక్స్-2024లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి, వరంగల్‌లో 500 గజాల ఇంటిస్థలం, కోచ్‌కు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇక ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ గ్రహీత దర్శనం మొగిలయ్యకు HYD హయత్ నగర్‌లో 600 చదరపు గజాల ఇంటిస్థలం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.