News September 24, 2024

నామినేటెడ్ పోస్టులు.. టీడీపీలో విభేదాలు?

image

AP: తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీతో టీడీపీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇద్దరు పార్టీ అధికార ప్రతినిధులు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. వారికి పదవులు ఇవ్వకపోవడంతో పాటు భవిష్యత్‌పై హైకమాండ్ భరోసా ఇవ్వకపోవడంతో నిరాశకు గురైనట్లు వార్తలొస్తున్నాయి. కాగా మొత్తం 99 నామినేటెడ్ పోస్టులకు గాను తొలి విడతలో 20 మంది పేర్లను ప్రభుత్వం ప్రకటించింది.

Similar News

News January 14, 2026

‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ&రేటింగ్

image

డబ్బు కోసం జమిందారీ అమ్మాయితో పెళ్లి, ప్రెసిడెంట్ కావడం, ఆ తర్వాత హీరోకు ఎదురయ్యే అనుభవాలే స్టోరీలైన్. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, వన్ లైన్ పంచ్‌లతో మరోసారి అలరించారు. హీరోయిన్ మీనాక్షి నటన, అందంతో ఆకట్టుకున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పాత స్టోరీ లైన్, యావరేజ్ మ్యూజిక్ మైనస్. సెకండాఫ్‌లో వచ్చే పొలిటికల్ డ్రామా ల్యాగ్ అన్పిస్తుంది. ఓవరాల్‌గా కామెడీ ట్రావెల్.
రేటింగ్: 2.75/5.

News January 14, 2026

CEERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>CSIR-<<>>సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (CEERI)లో 7ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc (ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్), BE/BTech, ME/MTech, సంబంధిత డిగ్రీ, టెన్త్+డిప్లొమా (MLT/DMLT) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: www.ceeri.res.in

News January 14, 2026

విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి

image

చెన్నైలో భోగి పండుగ విమాన రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. పొగమంచుకు తోడు భోగి మంటలతో వచ్చిన పొగతో పూర్ విజిబిలిటీ ఏర్పడింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. వాటిని డైవర్ట్ చేస్తున్నారు. అయితే సమయం గడిచేకొద్దీ విజిబిలిటీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రజలు ప్లాస్టిక్, రబ్బర్ టైర్లు కాల్చకుండా స్మోక్ ఫ్రీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని TNPCB కోరింది.