News September 24, 2024

2-3 రోజుల్లో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్!

image

AP: రాష్ట్రంలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవరించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రేపటిలోగా ఆర్టినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశముంది. దీంతో మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపులకు రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది.

Similar News

News September 24, 2024

భార్యపై పోలీసులకు స్టార్ హీరో ఫిర్యాదు

image

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటి నుంచి గెంటివేసినట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరారు. కాగా ఇటీవల భార్యతో విడాకులు తీసుకోనున్నట్లు జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 24, 2024

శ్రేయస్ అయ్యర్ కొత్త ఇల్లు బాగా కాస్ట్‌లీ.. Sq.ftకి ₹55,238

image

చదరపు అడుగుకి రూ.10 వేలు అంటేనే అమ్మో అంటాం. అలాంటిది ముంబైలోని వర్లీలో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, అతని తల్లి Sq.ftకి ₹55,238 చొప్పున 525 చ.అ ఇంటిని ₹2.90 కోట్లతో కొన్నట్టు జాప్కీ యాక్సెస్ వెల్లడించింది. దీనికి స్టాంప్ డ్యూటీ ₹17.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ₹30,000 *శ్రేయస్ అయ్యర్ గతంలో ముంబైలో మాక్రోటెక్ డెవలపర్‌లతో 48వ ఫ్లోర్‌లో 2380 Sq.ft ఇంటిని చ.అ.కు ₹49,817 చొప్పున కొనుగోలు చేశారు.

News September 24, 2024

భార్యను ఆర్థికంగా ఆదుకొనే బాధ్యత భర్తదే: ఢిల్లీ హైకోర్టు

image

భార్య సంపాదించగలిగినప్పటికీ, ఆమెను ఆర్థికంగా ఆదుకునే బాధ్యత భర్తదేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమెను ‘పరాన్నజీవి’ అని పిలవడం ఆమెకే కాకుండా మహిళలందరికీ అగౌరవమే అని వ్యాఖ్యానించింది. భార్యకు భరణం చెల్లించాలన్న కింది కోర్టు ఆదేశాల‌ను భర్త SCలో సవాల్ చేశారు. కేసు విచారణ సందర్భంగా భారతీయ మహిళలు తమ కుటుంబం, పిల్లలు, భర్త-అతని తల్లిదండ్రులను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని పేర్కొంది.