News September 24, 2024

అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దు: హైడ్రా

image

TG: బఫర్ జోన్, FTL పరిధిలో అక్రమ నిర్మాణాల కట్టడికి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాసింది. రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో సమావేశమై సూచనలు చేయనున్నారు. దీని కోసం ఒక లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల కూల్చిన అక్రమ కట్టడాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల లిస్టును సిద్ధం చేశారు.

Similar News

News September 25, 2024

ఆ మ్యాచ్‌కోసం సర్ఫరాజ్‌ను రిలీజ్ చేయనున్న టీమ్ ఇండియా?

image

బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం లేని నేపథ్యంలో అతడిని జట్టు నుంచి విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఇరానీ కప్‌లో ముంబై, రెస్టాఫ్ ఇండియా మధ్య త్వరలో మ్యాచ్ జరగనుంది. తమ కీలక ఆటగాడు సర్ఫరాజ్‌ను ఆ మ్యాచ్‌కోసం పంపించాలని బీసీసీఐని ముంబై కోరవచ్చని సమాచారం. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ థాకూర్ తదితర ఆటగాళ్లంతా ఇరానీ కప్‌లో ఆడనున్నారు.

News September 24, 2024

ఆ పార్టీలు బీజేపీకి మరింత దగ్గరవుతున్నాయ్!

image

TDP, JDU కేంద్రంలో BJPకి మరింత దగ్గరవుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తిరుమ‌ల ప్ర‌సాదం వివాదంలో TDP-జ‌న‌సేన వైఖ‌రి, విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ఠ జ‌రిగిన 8 నెలల త‌ర్వాత అయోధ్య రామమందిర నిర్మాణంపై PM మోదీని బిహార్ CM నితీశ్ ప్రశంసించడం అందులో భాగమే అని చెబుతున్నారు. అయితే, హిందూత్వ ఓటు బ్యాంకు BJPకి దక్కకుండా ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.

News September 24, 2024

భార్యపై పోలీసులకు స్టార్ హీరో ఫిర్యాదు

image

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటి నుంచి గెంటివేసినట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరారు. కాగా ఇటీవల భార్యతో విడాకులు తీసుకోనున్నట్లు జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.