News September 24, 2024
నెల్లూరు: ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.15 లక్షల విరాళం

విజయవాడ తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల మత్స్యకార సంఘం నాయకులు అన్ని గ్రామాల నుంచి తమ వంతు సహకారంగా విరాళం అందజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి రూ.15 లక్షల చెక్కు రూపంలో ఇచ్చారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు విరాళాలు సేకరించామన్నారు.
Similar News
News January 9, 2026
NLR: ఒక్క బండితో అక్రమాలు ఆగేది ఎలా?

నెల్లూరు జిల్లాలో 210క్వారీలు ఉండగా 111గనుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు అనధికారికంగా ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. కనీసం 4మండలాలకు ఓ పర్యవేక్షణ అధికారి ఉంటేనే వీటిపై ఫోకస్ చేయవచ్చు. ప్రస్తుతం జిల్లాలో ఆరుగురే ఉండగా.. తనిఖీలకు వెళ్లడానికి ఒకే ఒక వాహనం ఉంది. మైనింగ్ డిప్యూటీ డెరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉండగా గూడూరు AD శ్రీనివాసరావు ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఇలాగైతే అక్రమాలను ఎలా అడ్డుకోగలరు?
News January 9, 2026
నెల్లూరు: ఒక్కో తాటాకు రూ.10

భోగి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మంటలు వేస్తుంటారు. పల్లెటూర్లో అయితే అడవికి వెళ్లి ఏదో ఒక ఆకు కొట్టుకు వచ్చి మంటలు వేస్తున్నారు. పట్టణాల్లో అలా వేయడం కుదరదు. దీన్నే కొందరు పల్లెటూరు వాసులు క్యాష్ చేసుకుంటున్నారు. తాటాకులను నెల్లూరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కో తాటి మట్ట రూ.10లకు, కట్ట రూ.80లకు అమ్ముతున్నారు. ఆకులు కొట్టే కూలీలు, వాటిని అమ్మే వారికి డబ్బులు సమకూరుతున్నాయి.
News January 9, 2026
నెల్లూరు జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలును హోం మంత్రి అనిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లోని వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ నేతలు ఆయనతో ములాఖాత్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఆకస్మిక తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకుంది.


