News September 24, 2024
సారీ చెప్పిన కార్తీ.. స్పందించిన పవన్ కళ్యాణ్

AP: లడ్డూ విషయంలో చేసిన <<14180678>>వ్యాఖ్యలపై<<>> వెంటనే స్పందించిన హీరో కార్తీని Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. తిరుమల లడ్డూ అంశం లక్షల మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉందని, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని గుర్తించినట్లు పవన్ పేర్కొన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పట్ల బాధ్యతతో ఉండాలని తెలిపారు. మరోవైపు సత్యం సుందరం యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Similar News
News January 14, 2026
డెయిరీఫామ్.. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్ పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్‌లో 230 ఆవులు, గేదెలున్నాయి. రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తూ 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలు అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయమే లక్ష్యమంటున్నారు. ఈమె సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 14, 2026
వినాశకర పరిణామాలుంటాయ్.. అమెరికాకు రష్యా పరోక్ష హెచ్చరిక

ఇరాన్‌లో అమెరికా జోక్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా తెలిపింది. ‘2025 జూన్‌లో ఇరాన్‌పై చేసిన దాడిని రిపీట్ చేయాలనుకునేవారు, బయటి శక్తుల ప్రేరేపిత అశాంతిని వాడుకోవాలనుకునేవారు.. అటువంటి చర్యల వల్ల మిడిల్‌ఈస్ట్‌లో పరిస్థితులపై, అంతర్జాతీయ భద్రతపై ఉండే వినాశకరమైన పరిణామాల పట్ల అలర్ట్‌గా ఉండాలి’ అంటూ పరోక్షంగా హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ నిరసనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ ప్రకటించారు.
News January 14, 2026
టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్, RKపురంలోని <


