News September 24, 2024

గుంటూరు: తిరుమల లడ్డూ వ్యవహరంపై సిట్ ఏర్పాటు

image

ప్రముఖ ఆలయ తిరుమల – తిరుపతి ఆలయ లడ్డూ ప్రసాదం విషయంపై సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గుంటూరు సౌత్ కొస్టల్ జోన్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీని సిట్ చీఫ్‌గా ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Similar News

News July 9, 2025

గుంటూరులో స్పర్శ్ సీఎస్సీ శిక్షణ ప్రారంభం

image

గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో బుధవారం నుంచి నాలుగు రోజుల స్పర్శ్ సీఎస్సీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 5 జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు రెండు రోజుల థియరీ, రెండు రోజుల ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారని మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస వరప్రసాద్ తెలిపారు. జులై 10, 11వ తేదీల్లో గుంటూరు, పరిసరాల మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం కల్పించనున్నట్టు చెప్పారు.

News July 9, 2025

GNT: తురకపాలెం రోడ్డులో వ్యక్తి దారుణ హత్య

image

నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని తురకపాలెం రోడ్డులో కరిముల్లా హత్యకు గురయ్యాడు. స్తంభాలగరువుకు చెందిన నివాసిగా పోలీసులు నిర్థారించారు. కరిముల్లా అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు రెండ్రోజుల క్రితం పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి శవంగా మారడంతో కుటుంబ సభ్యులు మధురెడ్డి అనే వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 9, 2025

విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించండి: CPI

image

విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీ వైద్య మండలి శాశ్వత రిజిస్ట్రేషన్ నిరాకరణపై చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు. హోంగార్డుల జీతాల పెంపు, బదిలీలు, కోటా అమలుపై కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని రామకృష్ణ తెలిపారు.