News September 24, 2024

ప్రకాశం జిల్లాలో మెగా జాబ్ మేళా.. వివరాలివే.!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్- ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో.. ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9988853335 కు సంప్రదించాలన్నారు.

Similar News

News December 31, 2025

మార్కాపురం జిల్లాకు సిబ్బంది కేటాయింపు

image

మార్కాపురం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందిని నియమిస్తూ ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ అడ్మిన్ సెక్షన్ – 2, సూపరింటెండెంట్ మెజిస్ట్రేరియల్ సెక్షన్1, సూపరింటెండెంట్ కోఆర్డినేషన్ సెక్షన్ 2, సూపరింటెండెంట్ ల్యాండ్స్ 1 సెక్షన్-2, ల్యాండ్స్ 2 సెక్షన్ 1, పీజీఆర్ఎస్ 4, డ్రైవర్స్ 3, ఆఫీస్ సబార్డినేట్స్- 5 మందిని కేటాయించారు.

News December 31, 2025

మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ఇదే!

image

మార్కాపురంను నూతన జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల హాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కాలనీలో ఉన్న భవనాన్ని కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయం నుంచి పరిపాలన వ్యవహారాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భవనానికి నూతన హంగులనిచ్చారు.

News December 31, 2025

మార్కాపురం కలెక్టర్, SP ఎవరంటే..?

image

నేటి నుంచి మార్కాపురం జిల్లాగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో నూతన జిల్లాకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం కలెక్టర్ రాజాబాబును మార్కాపురం ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా, జేసీ గోపాలకృష్ణను ఇన్‌ఛార్జ్ జేసీగా, ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఇన్‌ఛార్జ్ ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. సరికొత్త జిల్లాకు తొలి కలెక్టర్, జేసీ, ఎస్పీలుగా వీరు బాధ్యతలు స్వీకరిస్తారు.