News September 25, 2024

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే కీలక నిర్ణయం

image

వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన చోట అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు ‘రైల్ రక్షక్ దళ్’ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఉద్యోగులకు అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో దీనిని ప్రారంభించింది.

Similar News

News November 6, 2025

జంట జలాశయాల వద్ద అక్రమ నిర్మాణాలపై పిల్ దాఖలు

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మాధవరెడ్డి ఈ పిల్ దాఖలు చేయగా.. మరొక పిటిషనర్ ఇంప్లీడ్ అయ్యారు. ఈ జలాశయాలు నగరానికి ఎంతో ముఖ్యమని పిటిషనర్ల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

News November 6, 2025

సినిమా అప్డేట్స్

image

* సందీప్‌రెడ్డి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రంలో దగ్గుబాటి అభిరామ్ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం.
* అమన్ కౌశిక్ డైరెక్షన్‌లో విక్కీ కౌశల్ హీరోగా ‘మహావతార్’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పరశురాముని పాత్రలో నటిస్తోన్న విక్కీ.. నాన్ వెజ్ మానేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
* కల్కి-2లో హీరోయిన్ పాత్ర కోసం ఆలియా, సాయిపల్లవి, అనుష్క, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు తెరపైకి వచ్చాయి.

News November 6, 2025

బయోమాస్‌తో రైతులకు ఆదాయం, ఉపాధి: సారస్వత్

image

AP: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయుక్తమని AP గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ సారస్వత్ పేర్కొన్నారు. బయోమాస్‌లో ఏపీ నం.1గా ఉందన్నారు. రైతులకు ఆదాయంతో పాటు ఉపాధి మెరుగుపడుతుందని బోర్డు భేటీలో చెప్పారు. విశాఖ(D) పూడిమడక వద్ద ₹1.85 L కోట్లతో NGEL హైడ్రోజన్ హబ్‌ను నెలకొల్పుతోందని CS విజయానంద్ తెలిపారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు.