News September 25, 2024
అక్టోబరు 13న విజయనగరం ఉత్సవాల ప్రారంభ ర్యాలీ

అక్టోబరు 13న విజయనగరం ఉత్సవాల ప్రారంభ ర్యాలీని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి, అయోద్యా మైదానం వరకు నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం తెలిపారు. ఈ ర్యాలీని వివిధ జానపద కళారూపాలతో సుమారు 15వేల మందితో గొప్పగా నిర్వహించాలన్నారు. 13,14 తేదీల్లో 2 రోజులు సాయంత్రం మెగా కల్చరల్ ఈవెంట్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్ పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
VZM: భవానీని అభినందించిన వైఎస్ జగన్

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీకి మాజీ సీఎం జగన్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కజకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భవానీ మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
News July 7, 2025
VZM: నేడు చిత్రలేఖనం పోటీలు

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు సోమవారం నిర్వహిస్తున్నామని డీఈఓ మాణిక్యంనాయుడు తెలిపారు. నేడు మండల స్థాయిలో, ఈనెల 9న జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. పొగాకు, మత్తు పదార్థాల వినియోగంపై చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. లింగ సమానత్వం, గౌరవ మర్యాదలు అంశంపై వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు.
News July 6, 2025
భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.