News September 25, 2024
L.H.M.S సేవలు సద్వినియోగం చేసుకోండి: GNT ఎస్పీ

లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (L.H.M.S)ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజల ఆస్థుల పరిరక్షణకు L.H.M.S రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని, ఈ యాప్‌ను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రజల అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చోరీలు జరగకుండా ఈ యాప్ ఉపకరిస్తుందని అన్నారు.
Similar News
News January 7, 2026
GNT: డిజిటల్ టిక్కెట్‌కు ప్రోత్సాహం.. జనరల్ టిక్కెట్లపై రాయితీ

రైల్ వన్ యాప్ వినియోగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త ప్రోత్సాహకం ప్రకటించింది. యాప్ ద్వారా కొనుగోలు చేసే జనరల్ టిక్కెట్లపై 3 శాతం తగ్గింపు ఇస్తామని సీపీఆర్వో ఏ.శ్రీధర్ గుంటూరులో మంగళవారం వెల్లడించారు. ఆన్లైన్ చెల్లింపులు చేసినప్పుడు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. జనవరి 14 నుంచి జులై 14 వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యమన్నారు.
News January 7, 2026
గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సెలవుల అనంతరం స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 18న విశాఖపట్టణం నుంచి చర్లపల్లి వరకు ప్రత్యేక రైలు(08513) రాత్రి బయలుదేరి గుంటూరు మీదుగా గమ్యానికి చేరుతుంది. అలాగే 19న చర్లపల్లి నుంచి విశాఖపట్టణానికి మరో ప్రత్యేక రైలు(08514) నడుస్తుంది. పండగ రద్దీని తగ్గించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
News January 7, 2026
GNT: హెల్మెట్ లేకపోతే వాట్సాప్ హెచ్చరికలు

ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిని గుర్తించి, వారి ఫోన్లకు వాట్సాప్ హెచ్చరికలు పంపిస్తోంది. రహదారి భద్రత సూచనగా పంపిన ఈ సందేశాల్లో నో హెల్మెట్ ఉల్లంఘనను చివరి హెచ్చరికగా పేర్కొంటూ, మళ్లీ కొనసాగితే జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.


