News September 25, 2024

ఒకే చట్టం పరిధిలోని యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు

image

AP: రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో యూనివర్సిటీ వీసీలను నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కరికులమ్ మార్పునకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News September 25, 2024

హజ్ యాత్ర దరఖాస్తు గడువు పొడిగింపు

image

AP: హజ్ యాత్రకు దరఖాస్తు గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,937 మంది యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

News September 25, 2024

‘రిటైల్ వ్యాపారుల ఆరోపణలు సరికావు’

image

విక్రయదారులకు కేవలం వేదికగా మాత్రమే అమెజాన్ ఉందని ఆ సంస్థ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. వ్యాపారులే ధరల్ని నిర్ణయిస్తారని చెప్పారు. భారీ రాయితీలు తమ అమ్మకాలను దెబ్బతీస్తోందన్న రిటైల్ వ్యాపారుల ఆరోపణలు సరికావన్నారు. భారత్‌లో గతేడాది కంటే ప్రస్తుత పండుగల సీజన్‌లో విక్రయాలు బాగుంటాయని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా 1,10,000 మంది తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు చెప్పారు.

News September 25, 2024

విద్యార్థులకు శుభవార్త

image

దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం గతంలో ప్రకటించిన గడువు SEP 23తో ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. అటు విద్యార్థులు తమ అప్లికేషన్స్‌లో సవరణ చేసుకునేందుకు దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.