News September 25, 2024

భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు: MLA సుజనా

image

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల పోస్టర్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చెప్పారు. భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Similar News

News September 25, 2024

BREAKING: మాజీ MLA మృతి

image

AP: మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. మాజీ MP, MLA మాగుంట పార్వతమ్మ(77) అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దివంగత MP సుబ్బరామిరెడ్డికి సతీమణి అయిన ఆమె.. 1996లో INC తరఫున ఒంగోలు MP, 2004లో కావలి MLAగా గెలిచారు. ప్రస్తుత MP మాగుంట శ్రీనివాసులురెడ్డికి పార్వతమ్మ వదిన. ఆమె మృతి తమ కుటుంబంలో విషాదం నింపిందని, రేపు నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహిస్తామని MP వెల్లడించారు.

News September 25, 2024

ఈ ఆరుగురు క్రికెటర్లు 8 వరల్డ్ కప్స్ ఆడారు!

image

ఇప్పటి వరకు మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలు 8సార్లు జరగగా ఆరుగురు క్రికెటర్లు వాటన్నింటిలోనూ ఆడారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్‌కు చెందిన బ్యాటర్ సుజీ బేట్స్, ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, శ్రీలంక కెప్టెన్ చామరి ఆటపట్టు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ ఆ జాబితాలో ఉన్నారు. కాగా వచ్చే నెల 3 నుంచి టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ UAEలో మొదలుకానుంది.

News September 25, 2024

కారుకు గీతలు గీశారని చిన్నారులపై కేసు

image

TG: కారుకు గీతలు గీశారని 8 మంది పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చిన్నారులంతా 2 నుంచి 9 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. హనుమకొండలోని ఓ ఫ్లాట్‌లో నివసించే CID కానిస్టేబుల్ కారుపై చిన్నారులు ఆడుకుంటూ గీతలు గీశారు. కారు మరమ్మతులకు డబ్బులు ఇస్తామని పిల్లల తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఆయన సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.