News September 25, 2024
నేడు సీఎం రేవంత్ కేసు విచారణ

TG: రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో CM రేవంత్‌పై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ విచారించనుంది. రిజర్వేషన్లను తీసేసేందుకు BJP యత్నిస్తోందని గతంలో CM వ్యాఖ్యానించారు. BJP ప్రతిష్ఠకు భంగం కలిగేలా రేవంత్ మాట్లాడారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 499, 125 సెక్షన్ల కింద రేవంత్‌పై కేసు నమోదైంది.
Similar News
News November 11, 2025
డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.
News November 11, 2025
మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది.
* వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్ చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
* కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది.
* అన్నం మెతుకులు విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి.
* చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.
News November 11, 2025
పుట్టగొడుగులు, కూరగాయలతో ఏటా రూ.7.50 కోట్ల వ్యాపారం

కూరగాయలు, ఆర్గానిక్ విధానంలో పుట్టగొడుగుల పెంపకంతో నెలకు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఆగ్రాకు చెందిన అన్నదమ్ములు ఆయుష్, రిషబ్ గుప్తా. వీరు ఆగ్రాలో 2021లో కూరగాయల సాగు, 2022లో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. నేడు నెలకు 40 టన్నుల పుట్టగొడుగులు, 45 టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. వీరి వార్షిక టర్నోవర్ రూ.7.5 కోట్లు. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


