News September 25, 2024

రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డుల రద్దు?

image

TG: రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరుకాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.

Similar News

News September 25, 2024

క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: లోకేశ్

image

AP: విశాఖపట్నం సమీపంలోని తాటిచెట్లపాలెం వద్ద తన కారును మంత్రి లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొట్టడంతో డ్యామేజీ అయిందని కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్విటర్‌లో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేశ్ ‘జరిగినదానికి క్షమాపణ చెబుతున్నా. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తా. అలాగే మీ వాహన డ్యామేజీకి అయ్యే ఖర్చును భరిస్తా’ అని రిప్లై ఇచ్చారు.

News September 25, 2024

విడాకులు తీసుకోనున్న ప్రముఖ నటి?

image

ప్రముఖ నటి ఊర్మిళ తన ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మోసిన్ అక్తార్ మిర్‌తో విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీరు విడిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త మోసిన్‌ను 2016 ఫిబ్రవరి 4న ఆమె పెళ్లాడారు.

News September 25, 2024

Gold Rate: ఎందుకు పెరుగుతోందంటే..

image

గోల్డ్ రేట్లు ఇన్వెస్టర్లకు హ్యాపీనిస్తే కస్టమర్లకు షాకిస్తున్నాయి. వారంలో విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.75,420గా ఉంది. ఇక ట్యాక్సులు కలుపుకుంటే రూ.76,189 వరకు ఉంది. US ఫెడ్ వడ్డీరేట్ల కోతతో డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, హెజ్బొల్లా యుద్ధంతో ఫిజికల్ గోల్డ్‌, గోల్డ్ ETFsకు డిమాండ్ పెరిగింది.