News September 25, 2024

కారుకు గీతలు గీశారని చిన్నారులపై కేసు

image

TG: కారుకు గీతలు గీశారని 8 మంది పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చిన్నారులంతా 2 నుంచి 9 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. హనుమకొండలోని ఓ ఫ్లాట్‌లో నివసించే CID కానిస్టేబుల్ కారుపై చిన్నారులు ఆడుకుంటూ గీతలు గీశారు. కారు మరమ్మతులకు డబ్బులు ఇస్తామని పిల్లల తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఆయన సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News September 25, 2024

హైడ్రా బాధితులకు అండగా ఉంటాం: KTR

image

TG: హైడ్రా బాధితులందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భరోసా ఇచ్చారు. న్యాయపరంగా ఎలాంటి అవసరం ఉన్నా తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు అందించాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు ఉద్దేశం మంచిదే అయినా ముందు వాళ్లకు వేరేచోట ఆవాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘అలా కాకుండా ఉన్నపళంగా ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసుకున్న పేదల దుకాణాలను కూల్చేయడం సరికాదు’ అని KTR మండిపడ్డారు.

News September 25, 2024

కార్తీ ఫ్యామిలీకి ఇవి అలవాటే: నటి కస్తూరి

image

తిరుమల లడ్డూపై హీరో కార్తీ చేసిన <<14180101>>వ్యాఖ్యలపై<<>> సీనియర్ నటి కస్తూరి స్పందించారు. ‘కార్తీ కుటుంబం సనాతన పద్ధతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేంకాదు. శబరిమలపై శివకుమార్ వ్యాఖ్యలు, ఆలయాల కంటే ఆస్పత్రులపై ఎక్కువ దృష్టి పెట్టాలని జ్యోతిక చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులు ఇలాంటివి సహించరు. ఆంధ్రాలో హిందూ వ్యతిరేకతను స్వాగతించరు’ అని ట్వీట్ చేశారు.

News September 25, 2024

మద్యం షాపులు ఖాళీ.. మందుబాబుల ఆవేదన

image

AP: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ కింద తక్కువ ధరకే లిక్కర్ అందుబాటులోకి రానున్న వేళ మందుబాబులకు కొత్త చిక్కొచ్చి పడింది. చాలా మద్యంషాపులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. డిపోల నుంచి సరఫరా నిలిపివేయడంతో పాటు ఉన్న నిల్వలను అమ్మాలని ఆదేశాలుండటంతో షాపులన్నీ ఖాళీ అయ్యాయి. కొన్ని ఖరీదైన బ్రాండ్లే అందుబాటులో ఉండటంతో తమకు ఇబ్బందిగా మారిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.