News September 25, 2024
KLPR: అన్ని కళాశాలల్లో ఇన్ఛార్జ్ల పాలన
KLPR: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొల్లాపూర్ పట్టణంలో ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, పానగల్, వీపనగండ్ల, కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రిన్సిపళ్లు లేకపోవడంతో ఇన్ఛార్జ్ల పాలనలో నడుస్తున్నాయి. పదోన్నతుల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది.
Similar News
News November 26, 2024
MBNR: భార్యను చంపి సెప్టిక్ ట్యాంకులో పడేశాడు!
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. భూత్పూర్ మం. ఎల్కిచెర్లలో నారమ్మను భర్త వెంకటయ్య హతమార్చాడు. అనంతరం సెప్టిక్ ట్యాంక్లో పడేసి ఏమీ తెలియనట్లే ఉన్నాడు. ఈ నెల 17న నారమ్మ కనిపించడం లేదంటూ కుమారుడు భరత్తో నాటకమాడారు. దీంతో 21న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
News November 26, 2024
MBNR: నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మల్లెబోయనపల్లిలోని నీటిశుద్ధి కేంద్రాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ EE వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిలతో ఆమె చర్చించారు. రాబోవు రోజులలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రిపేరులో ఉన్న బోరు మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని ఆమె ఆదేశించారు.
News November 26, 2024
ఉమ్మడి పాలమూరులో నేటి..TOP NEWS!!
✔ప్రజావాణి.. సమస్యలపై అధికారుల నిఘా
✔GDWL:గోల్డ్ షాప్ వద్ద మంటలు
✔పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
✔రాత పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలి:ANMలు
✔బిజినపల్లి:చెరువులో వృద్ధుడు మృతి
✔ఆత్మకూరులో గృహిణి ఆత్మహత్య
✔కార్తీక మాసం.. దేవాలయాల్లో భక్తుల సందడి
✔పలుచోట్ల ఘనంగా సదర్ ఉత్సవాలు
✔PUలో హ్యాండ్ బాల్,అథ్లెటిక్స్ ఎంపికలు వాయిదా
✔చివరి దశకు చేరిన కుల గణన సర్వే
✔30న సీఎం రాక.. సభ ఏర్పాట్లపై ఫోకస్