News September 25, 2024

కాన్పూర్ టెస్ట్.. బుమ్రాకు రెస్ట్?

image

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈనెల 27 నుంచి జరగనున్న 2వ టెస్ట్‌లో స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కివీస్, AUSతో సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉండటం, కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో అతడిని డ్రాప్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే IND అశ్విన్, జడేజాతో పాటు మరో స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. ఆ స్థానం కోసం కుల్దీప్, అక్షర్ పోటీ పడుతున్నారు.

Similar News

News September 25, 2024

దేవర సినిమాకు చుక్కెదురు

image

ఏపీలో దేవర టీంకు చుక్కెదురైంది. 14 రోజుల పాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవధిని 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచారు.

News September 25, 2024

బెన్ స్టోక్స్ మరోసారి యూటర్న్?

image

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్ బాల్ క్రికెట్‌లో దేశం తరఫున ఆడాలని సెలక్టర్లు, కోచ్ కోరితే తప్పకుండా ఆడతానని ఆయన తెలిపారు. కాగా 2022లో స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత 2023WCలో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ వీడ్కోలు పలికారు. ఇప్పుడు మరోసారి పునరాగమనం చేయాలని భావిస్తున్నారు.

News September 25, 2024

దేశంలో ఏ ప్రాంతాన్నీ పాకి‌స్థాన్ అనొద్దు: సుప్రీంకోర్టు

image

ఏ వర్గం పైనా క్యాజువల్ కామెంట్స్ చేయొద్దని జడ్జిలను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్థాన్‌గా పిలవొద్దని ఆదేశించింది. అది భారత ప్రాంతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేకమేనని తెలిపింది. KA హైకోర్టు జడ్జి, జస్టిస్ వీ శ్రీశానందన్ ఓ కేసులో బెంగళూరులోని ముస్లిం ఆధిపత్య ప్రాంతాన్ని పాకిస్థాన్ అనడం, మహిళా లాయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైరల్ వీడియోల కేసును సుమోటోగా విచారించింది.