News September 25, 2024
సూసైడ్ క్యాప్సుల్‌లో తొలి మరణం!

స్విట్జర్లాండ్‌లో ఓ మహిళ సూసైడ్ క్యాప్సుల్ ‘సార్కో పాడ్’ సాయంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆమె ఆత్మహత్యకు సహకరించారన్న ఆరోపణలతో పలువురిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జర్మనీ సరిహద్దు మేరీషాజన్ అటవీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఆత్మహత్య జరిగింది. కాగా ఈ క్యాప్సుల్‌లోని బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు విడుదలై అందులో పడుకున్న వ్యక్తి ఊపిరాడక నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు.
Similar News
News November 5, 2025
పేదలను ఓటు వేయనీయకండి: కేంద్ర మంత్రి

ఎన్నికల రోజు పేదలను పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకోండి అంటూ కేంద్రమంత్రి, JDU నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బిహార్‌లోని మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘పేదలను ఓటు వేయకుండా అడ్డుకోండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో వైరలవ్వడంతో పట్నా జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
News November 5, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

<
News November 5, 2025
ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.


