News September 25, 2024

డబ్బుల కోసమే నా పై ఆరోపణలు: హర్షసాయి

image

తనపై నార్సింగి పీఎస్‌లో అత్యాచార <<14188760>>కేసు <<>>నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో స్పందించారు. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్‌కు తెలుసు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News January 15, 2026

₹2 లక్షలు డిస్కౌంట్.. అయినా కొనేవారు లేరు!

image

ఇండియాలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న టెస్లాకు గట్టి షాకే తగిలింది. గతేడాది దిగుమతి చేసుకున్న 300 మోడల్ Y కార్లలో దాదాపు 100 అమ్ముడవక షెడ్డుకే పరిమితమయ్యాయి. ముందే బుక్ చేసుకున్న వారూ ఇప్పుడు వెనక్కి తగ్గుతుండటంతో మస్క్ కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఏకంగా ₹2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. భారీ ధరలు, తక్కువ డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.

News January 15, 2026

కమ్యునికేషన్ లేకపోవడమే గొడవలకు కారణం

image

ఏం మాట్లాడినా గొడవలవుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి వారి కమ్యునికేషన్ పాటర్న్ కారణమంటున్నారు మానసిక నిపుణులు. ఒకరు ఫీలింగ్స్ గురించి మాట్లాడితే, మరొకరు లాజికల్‌గా మాట్లాడతారు. ఒకరు ప్రజెంట్ గురించి, మరొకరు పాస్ట్ గురించి డిస్కస్ చేస్తారు. కాబట్టి దేని గురించి డిస్కస్ చేస్తున్నారో ఇద్దరికీ క్లారిటీ ఉండటం ముఖ్యమంటున్నారు. అప్పుడే బంధంలో అపార్థాలకు తావుండదని సూచిస్తున్నారు.

News January 15, 2026

సేంద్రియ సాగుతోనే సక్సెస్

image

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు ఉమేష్ వ్యవసాయం ప్రారంభించారు. రెండు ఎకరాల్లో ఒకవైపు సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నారు. కోడి ఎరువు, మేక ఎరువు, ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా మార్చారు. మార్కెట్ స్టడీ చేసి ఓడీసీ-3 వెరైటీ మునగ మొక్కలను నాటారు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి, ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.