News September 25, 2024

అక్టోబర్ 9న సింగరేణి కార్మికుల బోనస్ పంపిణీ

image

TG: సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటాను ప్రభుత్వం దసరా బోనస్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని అక్టోబర్ 9న చెల్లించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సింగరేణి CMD ఎన్.బలరామ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రూ.796 కోట్ల లాభాలను GOVT బోనస్‌గా చెల్లించనుంది. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది లబ్ధి పొందనున్నారు. సగటున ఒక్కొక్కరు రూ.1.90 లక్షల చొప్పున పొందే అవకాశముంది.

Similar News

News September 25, 2024

త్వరలో 35వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: CM

image

TG: రాష్ట్రంలో 30 లక్షలకుపైగా నిరుద్యోగులు ఉన్నారని CM రేవంత్ అన్నారు. ‘ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాం. 35వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 2-3 నెలల్లో మరో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక ప్రైవేటు సెక్టార్‌లో ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారి అవసరాలు తెలుసుకున్నాం. అందుకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణ ఇస్తాం’ అని BFSI కోర్సు ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానించారు.

News September 25, 2024

‘సక్సెస్ కిడ్’కి అప్పుడే 18 ఏళ్లు!

image

సోషల్ మీడియాలో వైరలయిన ‘సక్సెస్ కిడ్’ గురించి తెలియని వారుండరేమో. మీలో ఎవరో ఒకరు ఈ మీమ్‌ స్టిక్కర్‌ను షేర్ చేసుంటారు. అతని పేరు సామీ గ్రైనర్. సక్సెస్‌ను, సంతృప్తిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ సక్సెస్ కిడ్ ఫొటోను మీమర్స్ వాడుతుంటారు. 2007లో సామీకి 11 నెలలు ఉన్నప్పుడు ప్లోరిడా బీచ్‌లో ఆడుకుంటుండగా అతని తల్లి తీసిన ఫొటోతో వైరలయ్యాడు. నిన్న ఈ సక్సెస్ కిడ్‌కి 18 ఏళ్లు నిండాయి.

News September 25, 2024

దయచేసి ఆ వీడియో వైరల్ చేయొద్దు: రష్మీ గౌతమ్

image

తాను గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని యాంకర్ రష్మీ గౌతమ్ కోరారు. అది 2020 కంటే ముందు ఇంటర్వ్యూ అని తెలిపారు. ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేసి పాఠకులను తప్పుదోవ పట్టించొద్దని ఆమె ట్వీట్ చేశారు. కాగా జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైన వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.