News September 25, 2024

Gold Rate: ఎందుకు పెరుగుతోందంటే..

image

గోల్డ్ రేట్లు ఇన్వెస్టర్లకు హ్యాపీనిస్తే కస్టమర్లకు షాకిస్తున్నాయి. వారంలో విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.75,420గా ఉంది. ఇక ట్యాక్సులు కలుపుకుంటే రూ.76,189 వరకు ఉంది. US ఫెడ్ వడ్డీరేట్ల కోతతో డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, హెజ్బొల్లా యుద్ధంతో ఫిజికల్ గోల్డ్‌, గోల్డ్ ETFsకు డిమాండ్ పెరిగింది.

Similar News

News September 25, 2024

MUDA SCAM: హైకోర్టు తర్వాత సిద్దరామయ్యకు షాకిచ్చిన స్పెషల్ కోర్టు

image

కర్ణాటక CM సిద్దరామయ్యకు మరో షాక్. ఆయన భార్య పార్వతికి ముడా అక్రమంగా 14 సైట్లు కేటాయించిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని లోకాయుక్త పోలీసులను స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ స్కామ్‌లో దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దూ వేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఆ తర్వాతి రోజే స్పెషల్ కోర్టు జడ్జి సంతోష్ గజానన్ భట్ లోకాయుక్తను ఇలా ఆదేశించడం గమనార్హం.

News September 25, 2024

టాప్-2కు దూసుకెళ్లిన బుమ్రా

image

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకుకు దూసుకెళ్లారు. జడేజా 7 నుంచి ఆరో స్థానానికి చేరుకోగా, రవిచంద్రన్ అశ్విన్ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నారు. అలాగే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ 5, రిషభ్ పంత్ 6, రోహిత్ శర్మ 10, విరాట్ కోహ్లీ 12, శుభ్‌మన్ గిల్ 14వ ప్లేస్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

News September 25, 2024

జేపీ న‌డ్డా వ్యాఖ్య‌ల‌పై స్పందించిన RSS

image

BJP గ‌తంలో RSS స‌హ‌కారం తీసుకుంద‌ని, అయితే ఇప్పుడు సొంతంగా త‌న వ్య‌వ‌హారాల‌ను చూసుకోగలదన్న పార్టీ అధ్య‌క్షుడు JP న‌డ్డా వ్యాఖ్య‌ల‌ను ‘కుటుంబ వ్య‌వ‌హారంగా’ RSS అభివ‌ర్ణించింది. ఈ వ్యాఖ్యలతో రెండింటి మ‌ధ్య దూరం పెరిగింద‌న్న వార్త‌ల‌పై RSS అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పందించారు. ‘ఇది కుటుంబ వ్య‌వ‌హారం. అలాగే ప‌రిష్క‌రించుకుంటాం. దీనిపై బ‌హిరంగ వేదిక‌ల‌పై చ‌ర్చించ‌ం’ అని పేర్కొన్నారు.