News September 25, 2024

విజయనగరం ప్రోహిబిషన్&ఎక్సైజ్ ESగా బీ.శ్రీనాథుడు

image

జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ESగా బీ.శ్రీనాథుడుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా DEPOగా విధులు నిర్వహించారు. స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరోను ప్రభుత్వం రద్దు చేయడంతో ఎక్సైజ్ ఈఎస్‌గా ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో పార్వతీపురం ఏఈఎస్‌గా విధులు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.

Similar News

News September 29, 2024

సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించాలి: VZM జేసీ

image

ప్ర‌తీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగ‌దారుల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల‌ని జేసీ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ కోరారు. దీనికోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పీఎం సూర్య‌ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ ప‌థ‌కం అమ‌లుపై శ‌నివారం సంబంధిత శాఖ‌ల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మండ‌లాల వారీగా ప‌థ‌కం అమ‌లును స‌మీక్షించారు.

News September 28, 2024

VZM: రేపు శాప్ ఎండీ గిరీశ పి.ఎస్‌ జిల్లాకు రాక

image

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ. గిరీశ పి.ఎస్‌.ఆదివారం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంక‌టేశ్వ‌ర‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉద‌యం 12 గంట‌ల‌కు జిల్లా కేంద్రానికి చేరుకొని విజ్జీ స్టేడియం వ‌ద్ద శాప్ క్రీడా మైదానాన్ని ప‌రిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం క్రీడా సంఘాలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.

News September 28, 2024

విజయనగరం జిల్లా క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా.?

image

1. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది.?
2. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది.?
3. విజయనగరం జిల్లాలోని 4నదుల పేర్లు చెప్పండి?
4. జిల్లాకు చెందిన ద్వారం వెంకటస్వామి నాయుడు ఏ రంగంలో నిష్ణాతుడు.? ఈ ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ రూపంతో తెలియజేయండి.
NOTE: వీటి ఆన్సర్లను ఇదే ఆర్టికల్‌లో మధ్యాహ్నం 3గంటలకు మీరు చూడవచ్చు.