News September 25, 2024

క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: లోకేశ్

image

AP: విశాఖపట్నం సమీపంలోని తాటిచెట్లపాలెం వద్ద తన కారును మంత్రి లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొట్టడంతో డ్యామేజీ అయిందని కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్విటర్‌లో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేశ్ ‘జరిగినదానికి క్షమాపణ చెబుతున్నా. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తా. అలాగే మీ వాహన డ్యామేజీకి అయ్యే ఖర్చును భరిస్తా’ అని రిప్లై ఇచ్చారు.

Similar News

News September 25, 2024

ట్రోల్స్‌పై మనూ భాకర్ కౌంటర్

image

ఎక్కడికెళ్లినా ఒలింపిక్ మెడల్స్ తీసుకెళ్తున్నారని భారత షూటర్ మనూ భాకర్‌పై నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటికి తాజాగా ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘పారిస్ 2024 ఒలింపిక్స్‌లో నేను సాధించిన రెండు కాంస్య పతకాలు భారత్‌కే చెందుతాయి. ఏదైనా ఈవెంట్‌కు నన్ను పిలిచి, ఈ పతకాలను చూపించమని అడిగితే నేను గర్వంగా చూపిస్తుంటాను. నిర్వాహకులు కూడా మెడల్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంటారు’ అని ట్వీట్ చేశారు.

News September 25, 2024

ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలి: YS జగన్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత YS జగన్ పిలుపునిచ్చారు. ‘తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలి’ అని ట్వీట్ చేశారు.

News September 25, 2024

MUDA SCAM: హైకోర్టు తర్వాత సిద్దరామయ్యకు షాకిచ్చిన స్పెషల్ కోర్టు

image

కర్ణాటక CM సిద్దరామయ్యకు మరో షాక్. ఆయన భార్య పార్వతికి ముడా అక్రమంగా 14 సైట్లు కేటాయించిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని లోకాయుక్త పోలీసులను స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ స్కామ్‌లో దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దూ వేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఆ తర్వాతి రోజే స్పెషల్ కోర్టు జడ్జి సంతోష్ గజానన్ భట్ లోకాయుక్తను ఇలా ఆదేశించడం గమనార్హం.