News September 25, 2024

అన్ని జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు: లోకేశ్

image

AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గ్రీన్ ఎనర్జీ విషయంలో మంచి విధానం అందుబాటులో ఉంది’ అని ఆయన తెలిపారు.

Similar News

News July 4, 2025

ఇంగ్లండ్ దూకుడు.. ఒక్క ఓవర్లోనే 23 రన్స్

image

INDతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (57*), స్మిత్ (57*) దూకుడుగా ఆడుతున్నారు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రసిద్ధ్ వేసిన 32వ ఓవర్లో స్మిత్ వరుసగా 5 బౌండరీలు (4, 6, 4, 4, 4) బాదారు. ఆ ఒక్క ఓవర్లోనే 23 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ENG స్కోర్ 169/5గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 6 ఓవర్లలోనే 43 రన్స్ సమర్పించుకున్నారు.

News July 4, 2025

పవన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుతో ఉపయోగమేంటి?

image

AP Dy.CM పవన్ మార్కాపురంలో రూ.1,290 కోట్లతో <<16937877>>తాగునీటి పథకానికి <<>>శంకుస్థాపన చేశారు. వెలిగొండ నుంచి నీటిని తీసుకుని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల తాగునీటి కష్టాలు తీర్చనున్నారు. ఇందులో భాగంగా ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5 వేల కి.మీ మేర పైపులైన్లు నిర్మిస్తారు. 18-20 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

News July 4, 2025

గ్రూపులు కడితే భయపడతామా?.. ఎమ్మెల్యేలపై ఖర్గే ఫైర్!

image

TG: పీఏసీ సమావేశంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ‘నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడతామని అనుకుంటున్నారా? ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్లను నేను, రాహుల్ పట్టించుకోం’ అని ఖర్గే మండిపడినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడే వారికి, పదవులకు వన్నె తెచ్చే సమర్థులకు మాత్రమే వాటిని ఇవ్వాల్సిందిగా TPCCని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.